కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రచార బేరి కార్యక్రమంశుక్రవారం అచ్చుతాపురం మోసయ్యపేట గ్రామాల్లో ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు అచ్చుతాపురం సిపిఎం కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం పేదలు సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెట్రోలు డీజిల్ గ్యాస్ కరెంటు నిత్యవసర వస్తువులు ధరలు పెంచి మొయిలేని భారాలు వేస్తున్నది ప్రజల సంపదను కొల్లగొట్టి ఆదాని అంబానీలకు ఎనిమిదేళ్ల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పించింది మోడీ అవలంబిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా బిజెపిని ఇంటికి సాగనంపాలనిఅన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేసి రైతుల పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్మిక చట్టాల్లో మార్పులు చేయొద్దని స్థానిక ఎస్సీ జడ్ పరిశ్రమల్లో నిర్వాసితులు స్థానికులకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాంబిల్లి మండల కార్యదర్శి జి దేమ్నాయుడు మునగపాక సిపిఎం నాయకులు ఎస్. బ్రహ్మాజీ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పీవీ శ్రీనివాసరావు కె. సోమనాయుడు, ఆర్. లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు