కాలుష్య కోరలనుండి పుడమి తల్లి ని పరి రక్షించే బాద్యత మనందరిపై ఎంతైన ఉందని జీవీఎంసీ జోన్ -5 కమిషనర్ ఆర్ జి వి కృష్ణ అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 53 వ వార్డు పరిథి జాకీర్ హుస్సేన్ నగర్ పార్వతీ నగర్ తదితర ప్రాంతల్లో శుక్రవారం హెర్త్ డే (ధరిత్రీ దినోత్సవం) వేడుకలు ఘనంగానిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పచ్చధనం పై అవగాన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బాగంగా సమీప పార్క్ లో మొక్కలను నాటారు ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ 'ప్రపంచ ధరిత్రీ దినోత్సవం'. ప్రతియేటా ఏప్రిల్ 22న నిర్వహించే ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తుందని ప్రపంచదేశాలకు తమ పంథాను మార్చుకోమని చెపుతూ ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ధరిత్రీ దినోత్సవంలో భాగమవుతున్నాయన్నారు.
చాలా నగరాల్లో భూమితో మానవాళికి వున్న సంబంధాన్ని తెలుపుతూ. అనేక కార్యక్రమాలు, ప్రచారంతో 'ధరిత్రి వారం' నిర్వహిస్తున్నాయని సాధారణంగా ఏప్రిల్ 16తో మొదలై. ఏప్రిల్ 22తో ఇవి ముగుస్తాయి. ఈ క్రమంలో నిర్వహించే కార్యక్రమాలు పర్యావరణంతో నడుచుకునే విధానాన్ని ప్రోత్సహించటానికి తోడ్పడతాయని వాస్తవానికి ధరిత్రీ దినోత్సవం అనేది - భూమి, పర్యావరణానికి సంబంధించిన పండుగ. ప్రతి సంవత్సరమూ నిర్వహించుకునే ఒక చారిత్రక ఘట్టం. మనం భూమికి ఎంత సన్నిహితంగా అనుసంధానించబడి వుంటామో. అంతే సన్నిహితంగా ఆ భూమిని రక్షించుకుంటాం.
అది మన బాధ్యత అన్నారు. పచ్చధనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు. ఇంచార్జ్ శనేటర్ ఇన్స్ స్పెక్టర్ డాక్టర్ తిరుమల తులసీ, సచివాలయ శానిటేషన్ కార్యదర్శి భవానీ, శానిటేషన్ సూపర్ వైజర్ లు అమీనా, రామారావు జాకీర్ హుస్సేన్ నగర్ అద్యక్షులు మున్నా, కార్యదర్శి వలి, బాషా తదితరులు పాల్గొన్నారు.