ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న రష్యా సొంత నగరం బెల్గొరాడ్పై బాంబు దాడి చేసింది. గురువారం రాత్రి రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఈ నగరంపై ప్రయాణించింది. అదే సమయంలో యుద్ధ విమానం నుంచి ప్రమాదవశాత్తు ఓ బాంబు జారిపడింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద 40 మీటర్ల పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలు ఎగిరిపడినట్లు రష్యా వార్తాసంస్థ ఆర్ఐఏ వెల్లడించింది.