తమిళనాడు వేలూరు జిల్లా వాయపందల్ గ్రామంలో దారుణం జరిగింది. మలర్ (28) అనే మహిళ భర్త వినోద్ కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. అదే గ్రామంలో ఐదేళ్ల కుమారుడితో కలిసి మలర్ నివసిస్తోంది. ఆమెకు షణ్ముగం (30) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. పెద్దలు మందలించడంతో ఆమె ఎఫైర్ మానేసింది. దీనిని తట్టుకోలేని షణ్ముగం ఈ నెల 17న మలర్ను రాయితో తలపై కొట్టి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.