కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లు ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో ఆ పార్టీ దిద్దుబాటు చర్యకు దిగింది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ‘మీలాంటి గొప్ప నేత.. ఫోన్ చేయడం గొప్పగా భావిస్తున్నా’ అని ఈశ్వరప్ప అనగా ‘మీరు పార్టీపై విధేయతను కనబర్చడం సంతోషం. అందుకే మీతో మాట్లాడాలనుకున్నా. ఈశ్వరప్పజీ.. థాంక్యూ’ అని మోదీ బదులిచ్చారు.