అత్యంత సంపన్న ఆలయాల్లో మహారాష్ట్ర షిర్డీ సాయిబాబా టెంపుల్ ఒకటి. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ అంతా ఆయన భక్తులే. అయితే, భక్తుల కానుకలు సాయిబాబా ఆలయానికి కొత్త కష్టాలు తెచ్చాయి. పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను కానుకగా హుండీలో వేయడంతో టెంపుల్ సంస్థాన్ ఇబ్బందులు పడుతోంది. దాదాపు 3 ట్రక్కుల వరకూ నిండాయని, బ్యాంకుల లాకర్లు సైతం చిల్లరతో నిండిపోయాయని అధికారులు వివరించారు.