విజయవాడ , కృష్ణలంక 20వ డివిజన్ పరిధిలోని రణదీవెనగర్ కట్టపై ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చి రెండు లక్షల కోట్లను ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు చేశానని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నాడని, మిగిలిన ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు.