రైల్వేకోడూరులో పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న మునెల్లి విజయ్ కుమార్‌పై గురువారం వరకట్న వేదింపు కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రమణ తెలిపారు. ఏఎస్ఐ వివరాల మేరకు.. మండలంలోని గొంటువారిపల్లెకు చెందిన మునెల్ల్లి ఆనందరావు ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు విజయ్ కుమార్ అదే గ్రామానికి చెందిన పౌలయ్య వేదవతి దంపతుల కుమార్తె నవితను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల విజయ్‌కుమార్ అదనపు కట్నం తీసుకురావాలని భార్య నవితను వేధిస్తూ కాపురానికి తీసుకుపోలేదు. ఈ మేరకు ఆమె పోలీసులకు తెలపడంతో విజయ్ కుమార్ పై వరకట్న వేదింపు కింద కేసు నమోదు చేశామని ఏఎస్ఐ తెలిపారు.