కొన్ని సింపుల్ చిట్కాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తింటే జీర్ణ శక్తి పెరగడం సహా రక్తం వృద్ధి చెందుతుంది. వారానికి 2, 3 సార్లు బీట్ రూట్ తింటే రక్తహీనత తగ్గుతుంది. అలాగే రోజుకు 2 అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. వేసవిలో ఎక్కువగా నీరు తాగుతూ, తాజా పండ్లు తీసుకోవాలంటున్నారు.