కడప జిల్లా తాళ్లప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత హరినారాయణరెడ్డి కారులో బొందలదిన్నెకు వస్తుండగా తాడిపత్రి నుంచి ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హరినారాయణరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఢీకొట్టిన కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, తాడిపత్రి రూరల్ ఎస్ఐ మహమ్మద్ గౌస్, తాళ్లప్రొద్దుటూరు, ఆర్ఎస్ కొండాపురం ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని హరినారాయణరెడ్డిని విచారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ కొండాపురంలో ఆయనకు వైసీపీ వారితోనే స్వల్ప ఘర్షణ జరిగింది. హైవే రోడ్డు నిర్మాణానికి తోలుతున్న మట్టి విషయంలో కూడా వివాదం ఉంది. వీటన్నింటి కారణంగా దాడికి యత్నించారా అని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదును అనుసరించి తదుపరి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.