గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత భూములలో అక్రమ తవ్వకాలు జరిపినప్పుడు అధికారులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు, అధికారులు అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పోలీసులు కుమ్మక్కై అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్నారు.