ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేసిన నెహ్రూ కుటుంబానికి అడుగడుగునా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. బీజేపీ పెంపుడు కుక్కగా సీబీఐ వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. న్యాయవ్యవస్థ మీద మోదీ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోందని ఆరోపించారు. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను డంప్ కేంద్రంగా మోదీ మార్చుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అదానీకి నొప్పి తగలకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతోందన్నారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన నడుస్తోందని ఆయన అన్నారు.