గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచిందని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు.