ఒరిస్సా రాష్ట్రం నరేంద్రపురం ప్రాంతానికి చెందిన కైలాష్ చంద్ర బెహారా(37) చేబ్రోలు లోని జయలక్ష్మి స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ మిల్లు క్వార్టర్స్ లో కుటుంబ సభ్యులకు కలిసి ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి ఒరిస్సా రాష్ట్రం స్వగ్రామానికి వెళ్ళాడు. భార్యా పిల్లలను అక్కడే వదిలి వచ్చి క్వార్టర్స్ లో ఉంటున్నాడు. గత 20వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో భార్యకు అనుమానం వచ్చి సహచర మిల్లులోని కార్మికులకు సమాచారం ఇచ్చింది. గమనించిన కార్మికులు క్వార్టర్స్ లో చంద్రబెహారా మృతి చెందినట్లు భార్యకు తెలిపారు. భార్య వచ్చి పరిశీలించగా నోటి వెంట నురుగు ఉందని తన భర్త మృతి పై అనుమానాలు ఉన్నట్లు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ ఐ కే ఆనంద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు కు తరలించారు.