సమాజంలో అన్నివర్గాల ప్రజలకు సమాన సేవలను అందించడమే లక్ష్యంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులు పని చేయడం ద్వారా జిల్లా ప్రగతికి బాటలు వేయవచ్చునని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్పందన హాల్ లో శుక్రవారం సాయంత్రం జరిగిన 16వ సివిల్ సర్వీసెస్ డే వేడుకలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ శాఖ అధికారి వినాయకం లతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి హాజరయ్యారు. గతంలో శాశ్వత శిస్తు వసూలు చేసే విధంగా జమిందారి విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. వారికే శాశ్వత హక్కు ఉండేదని అన్నారు. ఆ తరువాతి కాలంలో కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. శిస్తు వసూలుతో అనేక భాధ్యతలను బ్రిటీష్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ తరువాతి కాలంలో మారిన పరిస్టితులు, జమిందారి వ్యవస్థ, నూతనంగా ఏర్పటు అయిన పల్నాడు జిల్లా అనేక సవాళ్ళను అధిగమిస్తూ ఏడాది పాటు ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో దగ్గరయ్యా మన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సైతం నిర్విరామంగా అందిస్తూనే పల్నాడు జిల్లా ప్రగతికి అచంచలమైన విశ్వాసంతో పని చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.