చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతకు రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో భాగంగా ఆశేష జనవాహిని హాజరు కావడం చూసి, దీన్ని జీర్ణించుకోలేని వైసిపి నాయకులు చంద్రబాబు కన్వాయ్ పై జరిపిన రాళ్ల దాడిని మదనపల్లె మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాటకొండ గుర్రప్ప నాయుడు తీవ్రంగా ఖండించారు. దీనిపై శనివారం అయన స్పందిస్తూ ప్రకాశం జిల్లా యర్రగొండ పాణ్యంలో రోడ్డు షోను అడ్డుకొనే ముందస్తు ప్రణాళికతో పురపాలక శాఖ మంత్రి ముందుండి వైసిపీ శ్రేణులను, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడికి పాల్పడేలా చేయడం అప్రజా స్వామికం శోచనీయమన్నారు. ఈ దాడి తో కమాండో సంతోష్ కుమార్ సహసాన్ని అభినందిస్తూ, అతని తలకు రాళ్ళు దాడితో గాయం కావడాన్ని ఖండించారు.