ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల ఖాళీలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. టీచర్ ఖాళీల లెక్కలు తీస్తున్నామన్న ఆయన, ఇప్పటికి 15 వేలకు పైగా పోస్టులు గుర్తించామని, వీటి లెక్క ఇంకా పెరుగుతుందని చెప్పారు. త్వరలో డీఎస్సీతో పాటు లెక్చరర్ల పోస్టులు కూడా భర్తీ చేస్తామని బొత్స చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే అన్ని విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుంటామన్నారు.