గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జడ్. పి. సమావేశ మందిరంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ప్రణాళిక, ఆర్థిక విషయములు, పనుల విషయములు, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, స్త్రీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ విషయాలు తదితర విషయాలపై స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. ఆయా కార్యక్రమాల ద్వారా చేపడుతున్న పనుల పురోగతిని సంబందిత శాఖల అధికారులు, జడ్పీ చైర్ పర్సన్ తెలియజేశారు.