ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళకు తీవ్ర గాయాలైన ఘటన పంజాబ్ హోటల్ జంక్షన్ జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ మేరకు ఎన్ ఏడీ జంక్షన్ వద్ద ఒక ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న మహిళ శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఎన్ ఏడి నుండి జాతీయ రహదారి మీదుగా పంజాబ్ హాటల్ జంక్షన్ మీదుగా నగరం వైపు వెళ్తుంది.
ఈ క్రమంలో పంజాబ్ హోటల్ జంక్షన్ అప్పయ్య నగర్ వద్ద ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో గమనించిన ఒక కార్ డ్రైవర్ కారు వేగాన్ని తగ్గించాడు. దీంతో కారు వెనుక ధ్విచక్ర వాహనం పై వస్తున్న మహిళ కారును ఢీకొని రహదారిపై పడిపోయింది. దీంతో సమీప విభాగిని తగిలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థానికుల సహకారంతో గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |