విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు 1086136 సచివాలయం పరిధి క్రాంతినగర్ లో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు పాల్గొని ఇంటింటికి వెళ్లి జగనన్న పాలనలో జరుగుతున్న మంచి గురించి అడిగి తెలుసుకున్నారు. జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సచివాలయం కన్వీనర్ సీతాకుమారి, సీనియర్ గుడ్ల భాస్కరరెడ్డి, శ్రీదర్, వాలంటరీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.