సంఘటిత రంగంలో ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించేందుకు రూపొందించిన సామాజిక భద్రత పథకమే ఎంప్లాయి స్టేట్ ఇన్యూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐసీ) అని ఈపీఎఫ్ఓ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. వి. శేషగిరిరావు, ఈఎస్ఎస్ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ బెహర పేర్కొన్నారు. శుక్రవారం ఆర్అంబ్బీ వద్ద ఉన్న మారియట్ హోటల్లో సీఐఐ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ లేబర్ అండ్ ఫ్యాక్టరీల చట్టం పై వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుడు భీమా చేసుకుంటే అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, విధి నిర్వహణలో గాయాలైన వారికి రక్షణ ఇది ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఇందులో తమ పేర్లును నమోదు చేసుకోవాలని సూచించారు. పీఎఫ్ ఫిర్యాదుల పరిష్కరం కోసం హెల్ప్ డెస్ను ఏర్పాటు చేశామని, సమస్యలుంటే అక్కడిక్కడే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పీఎఫ్, ఈఎస్ఐసీ వల్ల కలిగే లాభాలను గురించి వివరించారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ పి. పి. లాల్ కృష్ణ, సీఐఐ పీఎస్ ఠాగూర్, లీగల్ అడ్వైజర్ ఆధిత్య కామత్ పాల్గొన్నారు.