ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శనివారం, ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలుచోట్ల ఈదురు గాలులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది. నిన్నటి వరకు ఎండ దంచి కొట్టింది. శనివారం ఉదయం నుంచి విశాఖలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు.