అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలం కె. వెంకటాపురానికి చెందిన రెడ్డి దొంగోడు (55) అనే వ్యవసాయ కూలీ తెగి పడిన విద్యుత్ తీగ కాలికి తగిలి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులతో జిల్లా వైసిపి బీసీ సెల్ అధ్యక్షులు పైల రమేష్ జరిపిన చర్చలు ఫలించాయి. మృతుడి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చేందుకు, గ్రామంలో కాలం చెల్లిన విద్యుత్ తీగలు మార్చేందుకు అంగీకరించినట్లు రమేష్ తెలిపారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.