ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ కొనియాడారు. శనివారం చోడవరం మండలంలోని గాంధీ గ్రామం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదారణ పొందుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ఏ స్థాయిలో, ఏ ఏ వర్గాలకు చెందుతున్నాయో ఏమాత్రం పొందుతున్నారు అనే అంశంపై ఎమ్మెల్యే ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, అధిక సంఖ్యలో వైసిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.