రంజాన్ మాసమంతా దైవ చింతనతో ఉపవాస దీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పండగ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ శనివారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన రంజాన్ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాత్మిక చింతన, దానాలు, ధర్మాలు, చేపడతారు అన్నారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్ మాసం మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది అన్నారు. రంజాన్ సందర్భంగా మసీదులలో 'తరావిహ్' ప్రార్థనలు జరుగుతాయి అన్నారు. నెలరోజుల పాటు సాగే రంజాన్ పర్వదిన దీక్షలు చివరి రోజున నెలవంక దర్శనంతో పూర్తయిపోతాయన్నారు.