క్రమశిక్షణ, ధాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి, పరస్పర సదవగాహనకు ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని తెలిపారు. నెలరోజులు కఠోరవ్రతం పాటించిన వారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం లభించే రోజు అని ఆయన అన్నారు. ఈ మాసం అంతా పుణ్య కార్యం, దైవభీతి అనే సుగుణాలతో నిండిందన్నారు. రంజాన్ మాసంలో వికసించిన ఆధ్యాత్మికత, ప్రేమ, దయ, సామరస్యపు. కుసుమాలు ప్రజల జీవితాలలో గుబాలించాలని ఆకాంక్షించారు. దుష్ట చింతల్ని. కుహనా సంస్కారాన్ని. ఎదుర్కొని సత్ప్రవర్తనను నమాజ్ నేర్పిస్తుందన్నారు. సకల శుభాలను సమృద్ధిగా ఈ రంజాన్ అందించాలని ఆకాంక్షిస్తూ కరణం ధర్మశ్రీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.