ఇటీవల కాలంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరులో ఓ యువకుడు మహిళ మెడలో నుంచి చైన్ లాకెళ్లాడు. కృష్ణానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ లిఫ్ట్ వద్ద నిల్చొని ఉండగా ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. మహిళ వెనుక నిలబడిన అతడు వెంటనే చైన్ లాక్కొని పరిగెత్తాడు. బయట స్కూటీతో రెడిగా ఉన్న మరో వ్యక్తి యువకుడిని ఎక్కించుకుని పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa