ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై దుండగులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. కళ్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంకి రోడ్డులో భర్తతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న వివాహితను దుండగులు ద్రాక్ష పళ్లతో కొట్టి వేధించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వివాహిత, ఆమె భర్తను తీవ్రంగా చితకబాదారు. దీంతో వివాహిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.