గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గం పరిధిలోని లాం, లేమల్లెపాడు, గుంటూరు నియోజకవర్గం అరండల్ పేట, వెంగలాయపాలెం, ఒక్కొక్కటి చొప్పున నాలుగు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కడ కరోనా మరణాలు సంభవించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.