తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు జరిగిన సంస్కృత విద్యార్థుల ప్రతిభా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామి అనుగ్రహ భాషణం చేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ సాధించిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి షీల్డ్ ను బహూకరించారు.