తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మంత్రి నివాసంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలు, నవరత్నాల అందుబాటు కార్యక్రమాలు గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.