చెక్కుచెదరని సంకల్పంతో నియోజకవర్గంలో తిష్ట వేసిన వైసీపీ దుష్టశక్తుల తరిమి చంద్రగిరి అభివృద్దే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ "పులివర్తి నాని" చేపట్టిన "మీ ఇంటి వద్దకు. మీ పులివర్తి నాని" కార్యక్రమంలో 10వరోజు తిరుపతి రూరల్ మండలం మంగళం క్వార్టర్స్ లో సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన సమస్యలు సేకరిస్తూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం పాలనలో వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్మును దోచుకుని తింటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. సంక్షేమం మాటున భారీ అవినీతి జరుగుతోందన్నారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెంపుతోపాటు చెత్త పన్ను, ఇంటి పన్ను తదితరాల పేరుతో ప్రతి కుటుంబం నుంచి ఏడాదికి కనీసం లక్ష రూపాయిలు దోచుకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి ప్రజల రక్తం తాగడమే పనిగా పెట్టుకుందని, విద్యుత్ చార్జీలు ఏడు సార్లు పెంచి పేద ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారన్నారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు పప్పు , ఉప్పు, నూనె ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో నిరుపేదలు పట్టెడన్నం కడుపునిండా తినలేని దయనీయస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేక విధానాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా సైకిల్ గుర్తుకు ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడుని గెలిపించుకోవాలని కోరారు.
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.
10వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళం దగ్గర ముస్లిం సోదరులకు పులివర్తి నాని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేశారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.