చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీదేవీ భూదేవి సమేత కల్యాణ వెంకన్న బంగారు తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారిని వేకువజామునే నిత్యసేవలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ తిరుచ్చి వాహనంలో విహరిస్తున్న స్వామివారికి భక్తులు మంగళహారతుల సమర్పించారు. ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆర్జితం ఇన్స్పెక్టర్ అనంబట్టు ధనశేఖర్, అర్చకులు వి. మురళి కృష్ణమాచార్యులు, రవిచంద్రన్ స్వామి, తిరువేంగడం స్వామి, ఉదయ్ తేజ, చిరంజీవి, ఆలయ సిబ్బంది, భకులు పాల్గొన్నారు.