కుప్పం మున్సిపాలిటీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు కరపత్రాలు ముద్రించి ఇంటింటికి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ మునిరత్నం కరపత్రాలను ఆవిష్కరించారు. పంచాయతీగా ఉన్న కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసి ప్రజలపై పన్నుల భారం మోపారని కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియచేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పిఏ మనోహర్, సత్యేంద్రశేఖర్, రాజుకుమార్, శాంతారాం తదితరులు పాల్గొన్నారు.