విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు శనివారం విచ్చేసిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారికి అనకాపల్లి మండలంలోనిరాజుపాలెంగ్రామంలో బ్రహ్మాధ్రి పర్వతంపైవెలసినశ్రీసూర్యనారాయణస్వామిఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం విశాఖ నగరానికి విచ్చేసిన స్వామీజీకి జై శ్రీమన్నారాయణ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు బహుకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొణతాల బాబురావుఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులుకళ్యాణ్ కుమార్, సరిసాశ్రీనివాసరావు, గొల్లవిల్లి రామకోటి, బుజ్జి, రవి, త్రినాథ్, బాబురావు, రమణ, వాసు తదితరులు పాల్గొన్నారు