ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి మైసూరు నుండి గౌహతి వరకు సమ్మర్ స్పెషల్ (06203) రైలును నడపనునట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
రైలు నెం. 06203 మైసూరు- గౌహతి వన్-వే సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మైసూరు నుండి ఏప్రిల్ 23న 4:30 గంటలకు బయలుదేరి ఏప్రిల్ 24న 09. 10 గంటలకు దువ్వాడ చేరుకుని 09.12 గంటలకు బయలుదేరి ఏప్రిల్ 25న 21:45కి గౌహతి చేరుకుంటుందన్నారు.
ఈ రైలు కె ఎస్ ఆర్ బెంగళూరు కాంట్ యలహంక, ధర్మవరం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాల్‌గూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్ , దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రఖ్, బాలాసోర్, ఖరగ్‌పూర్, దంకుని, బర్ధమాన్, రాంపూర్‌హాట్, మాల్డా టౌన్, బర్సోయి, కిషన్‌గంజ్, న్యూ జల్‌పాయిగురి, న్యూ జల్‌పాయిగురి, అలీపుర్దువార్, కోక్రాఝర్, న్యూ బొంగైగావ్, రంగియా కామాఖ్య తదితర స్టేషన్లలో ఆగుతుందన్నారు.