ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజులు గడిచిన తరువాత పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రౌడీషీటర్ తో పాటు మరో 4 మందిని ఎంవీపీ స్టేషన్ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ మారికవలసలో నివాసముంటున్న రిక్కి శివ (21) గత కొంతకాలంగా రౌడీషీటర్ గుర్రాల సాయి వద్ద పనిచేస్తున్నారు. గుర్రాలకు గడ్డివేడంతో పాటు
వివాహాలకు రథం బుక్ చేసి కార్యక్రమానికి వెళ్లడం చేసేవాడు. శివ, గుర్రాల సాయి నడుమ గత కొద్దిరోజులుగా ఆదిపత్య పోరు కొనసాగుతుంది. వీరిద్దరూ కలిసి మద్యం సేవించనపుడు శివ అనే వ్యక్తి గుర్రాలసాయిని దుర్భాషలాటం అంతు చూస్తానని అనడం, బెదిరిండం జరిగేది. ఈ విషయం మనసులో పెట్టుకొని ఎలాగైన శివను హతమార్చాలని అనుకున్నాడు. పథకం ప్రకారం ఈనెల 3న గుర్రాల సాయి పెదజారిపేటలో శివకు పార్టీ ఉందని
రప్పించి తన అనుచరులతో కర్రలతో చితకబాదాడు. అనంతరం అదే రాత్రి గాజువాక తీసుకెళ్లి అక్కడ కూడా తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. గాజువాక నుంచి పెదజాలరిపేటకు తీసుకొచ్చి 4న వెక్కువ జామున మధువాడ తన ఇంటి వద్ద విడిచిపెడతానని చెప్పి శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర కొవ్వాడ ప్రాంతంలోని బీచ్ కు తీసుకెళ్లాడు. సముద్ర తీరంలో గొయ్యి తీసి గోతిలో శివను పాతిఉంచి అతని తలపై రాళ్లతో కొట్టి చంపాడని పోలీసులు నిందులు ద్వారా సేకరించినట్లు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు డీసీపీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఎంవీపీ సి. ఐ మల్లేశ్వరరావు, సిబ్బంది నిందితుడు గుర్రాల సాయిని తీసుకెళ్లి రణస్థలం కొవ్వాడ ప్రాంతంలో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు. కేసునమోదు చేసి గుర్రాల సాయి (27)తో పాటు హత్యకు సహకరించిన మరో నలుగుర్ని అదుపులోకి తీసుకొని శనివారం అరెస్టుచేశారు.