అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని పోతురాజు గుమ్మలు గ్రామంలో శనివారం ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షానికి ఓ పశువుల కాపరి మీద పిడుగుపాటు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం. మండలంలోని పోతురాజు గుమ్మలు గ్రామానికి చెందిన వంతల. శంబునాయుడు రోజువారి మాదిరిగానే పశువులను మేత కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవగా సంబునాయుడు మీద పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలిపారు. దీనితో స్థానికులు మృతుడి కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని విషాద సంద్రంలో మునిగిపోయారు. సంబు నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.