విశాఖపట్నం కి సింహాచలం దేవస్థానం ఎన్నో ఏళ్ల చరిత్ర గల దేవాలయం. అటువంటి దేవాలయం లో శ్రీ వరహాలక్ష్మి నరసింహాస్వామి చందనం తొలగించి ఏడాదిలో ఒక్కరోజు నిజరూపదర్శనం ఇచ్చేరోజున చందనోత్సవం అంటారు. నిజరూపంలో స్వామి వారి దర్శనం చేసుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామి దర్శనం కొరకు వివిఐపి లు సైతం దేవస్థానం నిబంధనలకు లోబడి దర్శనం కి వెళ్ళవలసిందే.
చందనోత్సవం రోజు అభిషేకంలు పూర్టైన తరువాత దేవాలయం ధర్మకర్తలు విజయనగరం రాజులు మొదటి దర్శనం అనంతరం ఇతరులకు అనుమతినిస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కొరకు దేవస్థానం ప్రజాప్రతినిధులకు విఐపి పాసులు ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి మీడియా కు డ్యూటీ పాసులు ఇస్తారు. దేవస్థానం ఇచ్చే పాసులలో ఏఈఓ ఆనంద్ అక్రమార్కులకు ముట్టచెప్పారని ఏఈఓ పక్కనున్న సిబ్బంది కాని వారు ఉండి అక్రమాలకు పాల్పడుతున్నారని ఒక స్పెషల్ పోలీస్ అధికారి నీలదీయటంతో కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.
గోపాలపట్నం సీఐ నరసింహారావు ఏఈఓ ఆనంద్ నుంచి బందోబస్త్ కొరకు సమాచారం కొరకు కార్యాలయం కి వచ్చే సమయానికి ఏఈఓ ఆనంద్ ఒక గదిలో తలుపులు వేసుకుని సీఐ వచ్చారు తలుపు తియ్యండి అని పోలీస్ సిబ్బంది ఎంత ప్రయత్నించిన సుమారు 30నిముషాలకు పైగా తలుపులు తియ్యకపోవటం పై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఏఈఓ ఆనంద్ తలుపులు వేసుకుని అంత సేపు ఏమి చేసారు లోపల ఉన్నవారికి ఎంత మొత్తం లో టికెట్స్ ఇచ్చారో అని అక్కడ ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధుల అనుచరులు ఆరోపిస్తున్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏఈఓ ఆనంద్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఇవ్వవలసిన వారికి ఆయన పాసులు ఇవ్వకపోవటం పై ఏ ఓ ఆనంద్ పై తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ మీడియా వారికి ఇస్తామని గత మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుని శనివారం సాయంత్రం పాసులు లేవు మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని ఘాటుగా చెప్పటంతో స్థానిక మీడియా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డి పి ఆర్ ఓ కార్యాలయం నుండి అధికారిక లిస్ట్ లో ఉన్నవారికి సైతం పాసులు ఇవ్వలేదని కొందరు మీడియా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డి పి ఆర్ ఓ కార్యాలయంలో పత్రిక ముద్రణ అయ్యి కార్యాలయంలో నమోదు ఉన్నవారి జాబితా మాత్రమే ఇస్తారని పత్రికలు నడుస్తున్న పత్రిక ముద్రణకు అధిక వ్యయం అవ్వటంతో ముద్రణ చెయ్యకుండా నడుస్తున్న పత్రికలు ఉన్నాయని వారిని పరిగననలోకి తీసుకోవాలని కోరగా శానుకూలంగా ఉండి ఉదయం నుంచి ఇస్తాను అని చెప్పిన ఏఈఓ ఆనంద్ సాయంత్రానికి ఆ పాసులు మీడియా కి సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చి అసలు మీడియా వారికి పాసులు లేవు అని చెప్పటంతో స్థానిక మీడియా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏఈఓ ఆనంద్ పై తగు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధుల అనుచరులు, అధికారులు కోరుతున్నారు.