ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళకు నగర బహిష్కరణ.. ఎందుకంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 23, 2023, 05:40 PM

విజయవాడలో ఓ మహిళ నగర బహిష్కరణకు గురైంది. సారమ్మ అనే మహిళ పలుసార్లు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమె పేరుపై 13 కేసులు నమోదయ్యాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోలేదు. చివరిసారిగా ఆమెను పోలీసులు హెచ్చరించినా ఖాతరు చేయకపోవడంతో ఆమెను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com