ఏపీలోని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యాహక్కు చట్టం – 2010కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నెం.38 విడుదల చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు ఇచ్చే గుర్తింపు మూడేళ్ల వరకే ఉంటుంది. దీన్ని మళ్లీ ఆ యాజమాన్యాలు పొడిగించుకోవాలి. తాజా సవరణతో ఈ పరిమితిని ఎనిమిదేళ్ల వరకూ పొడిగించింది.