నకిలీ వెబ్సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. http://tirupatibalaji.ap.gov.in/ పేరుతో అధికారిక వెబ్సైట్ ఉండగా.. చిన్న మార్పు చేసి కొంతమంది http://tirupatibalaji-ap-gov.in/ పేరిట నకిలీ వెబ్సైట్ సృష్టించారని ఒక ప్రకటనలో తెలిపింది. TTD అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.