వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మైసూరు- గౌహతి మధ్య ఓ సింగిల్ ట్రిప్ స్పెషల్ రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం.06203 మైసూరులో 23వ తేదీ ఆదివారం ఉదయం 4:20 గంటలకు బయలుదేరి.. అదేరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గుంతకల్లుకు వచ్చి, 25వ తేదీ రాత్రి 9:45 గంటలకు గౌహతికి చేరుకుంటుంది. ఈ రైలు బెంగళూరు, లింగంపల్లి, సికింద్రాబాద్, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్ మీదుగా వెళ్తుంది.