కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఉద్యోగులకు ఇటీవల డీఏ, పెన్షనర్లకు డీఆర్ లను పెంచిన కేంద్రం.. జూలైలో మరోసారి డియర్ నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే 50 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది. సాధారణంగా 7వ వేతన సంఘం ప్రకారం డీఏ, డీఆర్ లను ఏడాదికి రెండుసార్లు పెంచాల్సి ఉంటుంది. దీని ప్రకారం రెండవ రివిజన్ జూలైలో జరగనుంది.