ప్రస్తుత రాజీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని, మంచి నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. కులమతాలకు ఆధారంగా కాకుండా ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు.