కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. బాబలేశ్వర్ MLA ఎంబీ పాటిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో ఓ యువకుడు తమ గ్రామానికి ఏం చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన పాటిల్ యువకుడిపై చేయి చేసుకున్నారు. యువకుడిని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టాడు. సదరు వీడియోను ఇంటర్నెట్లో వైరల్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తోంది.