ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 235/4 స్కోరు చేసింది. చేధనలో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి ఓటమి పాలైంది. జేసన్‌రాయ్ (61), రింకూసింగ్ (53*) పరుగులు చేసినా కోల్‌కతా గెలుపు తీరాలకు చేరలేకపోయింది.