బిహార్ ముజఫర్‌పుర్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ మొబైల్ టవర్‌ను ఎత్తుకెళ్లిన 10రోజుల్లోనే మరొకటి చోరీ చేశారు.సికందర్పుర్లోని న్యూ కాలనీ బాలుఘాట్లో జీటీఎల్ కంపెనీకి చెందిన మొబైల్ టవర్ ఉంది. దీనిని పరిశీలించేందుకు ఆ సంస్థ ఉద్యోగులు వచ్చారు. ఈ క్రమంలో టవర్ చోరీకి గురైనట్లు వారు గుర్తించారు. కాగా, నాలుగైదు నెలల కిందటే టవర్ చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.