న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. నేడు ఉదయం కెర్మాడెక్ దీవుల సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. దీంతో అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే ప్రమాదం ఉదని హెచ్చరించింది. కాగా, గత నెలలో కూడా కెర్మాడిక్ దీవుల్లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.