ఉత్తర బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. బుర్కినాబే మిలటరీ యూనిఫాంలో ఉన్న కొందరు సాయుధులు కర్మ గ్రామంలోకి చొరబడి విచక్షణ రహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. సుమారు 60మందిని కాల్చి చంపేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఇస్లామిస్ట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ సంవత్సరాలుగా పదే పదే దాడులు జరుగుతున్నాయి.